1. చిత్తూరు జిల్లా తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ ప్రకటించింది. ఆగస్ట్ 25 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. తిరుపతిలోని టీటీడీసీలో ఈ జాబ్ మేళా జరగనుంది. వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారు. ఆ పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాలి. ఉదయం 9.30 గంటల్లోగానే జాబ్ మేళా జరిగే వేదిక దగ్గర రిపోర్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను 91609 12690, 99635 61755, 08572 295429 నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)