సెంట్రల్ రైల్వే (Central Railway) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 17న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఇటీవల రైల్వే ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సెంట్రల్ రైల్వే (Central Railway) భారీగా అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
2/ 7
మొత్తం 2422 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల (Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 17 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
3/ 7
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ rrccr.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హతల వివరాలు: టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
4/ 7
కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఇంకా ఐటీఐ చేసి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు జనవరి 17 నాటికి 15-24 ఏళ్లు ఉండాలి.
5/ 7
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ rrccr.com ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే ‘Online application for engagement of apprentices for the year 2021-22’ లింక్ పై క్లిక్ చేయాలి.
6/ 7
Step 3: కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. సూచించిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. Step 4: అప్లికేషన్ ఫామ్ నింపడం పూర్తయిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
7/ 7
Step 5: అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.