1. భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. సెంట్రల్ రైల్వే (Central Railway) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 21 పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, విద్యార్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. లెవెల్ 5/4 పోస్టులు 3 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. లెవెల్ 3/2 పోస్టులు 18 ఉన్నాయి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + కోర్స్ ఉన్నవారు యాక్ట్ అప్రెంటీస్‌షిప్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌ను అర్హతగా పరిగణించరు. (ప్రతీకాత్మక చిత్రం)
4. క్రీడల వారీగా కేటాయించిన పోస్టుల వివరాలు చూస్తే బాస్కెట్ బాల్- 2, బాక్సింగ్- 2, హాకీ-2, వాటర్ పోలో-1, అథ్లెటిక్స్-1, బ్యాడ్మింటన్-1, క్రికెట్-2, కబడ్డీ-2, వాలీబాల్-1, వెయిట్ లిఫ్టింగ్-1, రెజ్లింగ్-2 పోస్టులు ఉన్నాయి. ఈ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. (Source: Official Notification)
5. క్రీడార్హతల వివరాలు చూస్తే లెవెల్ 5/4 పోస్టులకు బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ, లెవెల్ 3/2 పోస్టులకు వాటర్ పోలో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడల్లో రాణించాలి. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250. (ప్రతీకాత్మక చిత్రం)