కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తికాకుండానే బడి మానేసిన వారు మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకం తీసుకువచ్చింది కేంద్రం.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
16-19 ఏళ్ల వయస్సు ఉండి.. డిస్టెన్స్ విధానంలో టెన్త్, ఇంటర్ చదువుకోవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) కింద ఏడాదికి రూ. 2 వేల మేర ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయనుంది కేంద్రం. ఈ డబ్బులను విద్యార్థులు అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, మెటీరియల్ కోసం వినియోగించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే.. ఈ డబ్బులను విద్యార్థుల చేతికి ఇస్తే వారు అడ్మిషన్ పొందకుండానే ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అధికార వర్గాలు భవిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దీంతో ఆ డబ్బులను సార్వత్రిక విద్యాపీఠానికి ఇవ్వాలా? లేదా డీఈఓలకు ఇవ్వాలా? అన్న అంశంపై అధికారులు యోచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
సార్వత్రిక విద్యాపీఠాల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అయితే కేంద్రం తీసుకువచ్చే ఈ పథకం నిబంధనలపై స్పష్టత వస్తే అనేక మంది అభ్యర్థులు అడ్మిషన్ తీసుకునేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)