దేశంలోని వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీలపై రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి థర్మేంద్ర ప్రధాన్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎన్ని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మంజూరయ్యాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయో తెలపాలని ఎంపీ నీరజ్ శేఖర్ కోరారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 18911 పోస్టులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో 6136 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి సమాధానమిచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఆయా యూనివర్సిటీల్లో ఏప్రిల్ 1 నాటికి 36351 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు కాగా, 13,706 ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇంకా ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి టీచింగ్ పోస్టులు మార్చి 31 నాటికి 444 మంజూరు కాగా.. 198 ఖాళీగా ఉన్నట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఇదే యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం 2499 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు కాగా.. 1235 ఖాళీలు ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)