ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు డిసెంబర్ 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎకనామిస్ట్ విభాగంలో 1ఎకనామిస్ట్ విభాగంలో 12 పోస్టులు, ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ విభాగంలో 13, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 14, డేటా సైంటిస్ట్ విభాగంలో 15, క్రెడిట్ ఆఫీసర్ విభాగంలో 106, డేటా ఇంజనీర్ విభాగంలో 117, IT సెక్యూరిటీ అనలిస్ట్ విభాగంలో 18, IT Soc అనలిస్ట్-29, రిస్క్ మేనేజర్- 10, టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్) 4, ఫైనాన్షియల్ అనలిస్ట్-20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-15, లా ఆఫీసర్ 20, రిస్క్ మేనేజర్ 10, సెక్యూరిటీ II-3, సెక్యూరిటీ I విబాగంలో ఒక ఖాళీ ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్డీ చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజుగా రూ. 850ని నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు ఎలా అంటే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నంబర్ 23న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆ తేదీ నుంచి www.centralbankofindia.co.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయాలి. అనంతరం ‘అప్లై ఆన్లైన్’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. మొదట మీ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)