CBSE Recruitment 2019 | మీరు ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసయ్యారా? అయితే మీకు శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE ఉద్యోగాల భర్తీ చేపట్టింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE. మొత్తం 357 ఖాళీలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. గ్రూప్ ఏలో మొత్తం 35 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ సెక్రెటరీ- 14, అనలిస్ట్ (ఐటీ)- 14, అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7 పోస్టులున్నాయి. గ్రూప్ బీలో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్- 8 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. గ్రూప్ సీలో మొత్తం 314 ఖాళీలున్నాయి. జూనియర్ అసిస్టెంట్- 204, సీనియర్ అసిస్టెంట్- 60, స్టెనోగ్రాఫరీ- 25, జూనియర్ అకౌంటెంట్- 19, అకౌంటెంట్- 6 పోస్టులున్నాయి. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్ ఏ పోస్టుకు రూ.1500, గ్రూప్ బీ పోస్టుకు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళలు, రెగ్యూలర్ సీబీఎస్ఈ ఉద్యోగులకు ఫీజు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)