కరోనా కారణంగా ఈ ఏడాది కూడా 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ.. ఇంటర్నల్ అసెస్మెంట్ విధానం ద్వారా మార్కులు కేటాయించాలని నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ముందుగా ఈ నెల 20 నాటికి పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని భావించింది. అందుకు తగ్గట్టుగా సీబీఎస్ఈ స్కూల్స్ విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల వివరాలను పంపించాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అయితే ఈ విషయంలో పలు స్కూల్స్ సరైన విధానాన్ని పాటించకపోవడంపై సీబీఎస్ఈ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము రూపొందించిన విధివిధానాలను కచ్చితంగా పాటించాలని స్కూల్స్‌ను హెచ్చరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ అంశంలో స్కూల్స్ నిర్లక్ష్యంగా వహించకూడదని తాజాగా ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొంది. పారద్శకంగా, పద్ధతిగా ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
మార్కుల కేటాయింపు విషయంలో అనేక పాఠశాలలు సరైన విధానాన్ని పాటించడం లేదని సీబీఎస్ఈ అభిప్రాయపడింది. ఇలా చేయడం ద్వారా మంచి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)