4. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఆలస్యం కావొచ్చని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇలాగే కొనసాగితే మార్చిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడొచ్చని అన్నారు కేంద్ర విద్యా శాఖ మంత్రి. ఇక 2021 లో నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ విషయంలో సీబీఎస్ఈ ప్రత్యామ్నాయాలు గురించే అలోచించే అవకాశం ఉన్నట్టు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. పాఠశాలలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయన్న స్పష్టత కూడా లేదు. మరోవైపు 2021 లో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల్లో కూడా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఎక్కువగా అప్లికేషన్ బేస్డ్, ఆబ్జెక్టీవ్ టైప్ లేదా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రశ్నలు ఉండొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావడానికి చాలా సమయం ఇస్తామని మంత్రి తెలిపారు. పరీక్ష తేదీలను చాలా ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరిస్థితి సీబీఎస్ఈకి తెలుసని, బోర్డు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా వారిని సంప్రదిస్తుందని సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)