1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఫలితాల పట్టిక ప్రక్రియ పూర్తైనట్టు సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించింది. సీబీఎస్ఈ ప్రమాణాల ప్రకారం స్కూళ్లు విద్యార్థుల మార్కులను పంపాయని సీబీఎస్ఈ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు జూలై 20న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే మరో రెండు వారాల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
3. బోర్డు పరీక్షలు వాయిదా పడటంతో విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు ఫైనల్ మార్కులు వేయనుంది సీబీఎస్ఈ. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
4. మార్కింగ్ స్కీమ్ ప్రకారం ఇంటర్నల్ అసెస్మెంట్లో ప్రతీ సబ్జెక్ట్‌కు 20 మార్కుల చొప్పున వేస్తారు. మిగతా 80 మార్కులను విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
5. పీరియాడిక్ టెస్ట్ లేదా యూనిట్ టెస్ట్-10 మార్కులు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ 30 మార్కులు, ప్రీ-బోర్డ్ ఎగ్జామ్-40 మార్కుల చొప్పున లెక్కించి ఫైనల్ మార్కులను వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
6. ఈ పద్ధతి ప్రకారం ఎవరైనా విద్యార్థులు పాస్ మార్కులు సాధించకపోతే గ్రేస్ మార్కులు వేసి వారిని పాస్ చేయాలని సీబీఎస్ఈ స్కూళ్లను ఆదేశించింది. ఒకవేళ విద్యార్థులు ఆ విధంగా కూడా పాస్ కాకపోతే ఎసెన్షియల్ రిపీట్ లేదా కంపార్ట్మెంట్ కేటగిరీకి మారుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
7. ఇక సీబీఎస్ఈ ఈ ఫార్ములాతో విడుదల చేసిన ఫలితాలపై విద్యార్థులు అసంతృప్తిగా ఉంటే ఆప్షనల్ ఎగ్జామ్ రాయొచ్చు. కరోనా వైరస్ పరిస్థితులను బట్టి ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
8. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రిజల్ట్స్ విడుదల చేయగానే విద్యార్థులు http://cbseresults.nic.in/ లేదా https://www.cbse.gov.in/ వెబ్సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
9. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు జూలై 31 లోగా విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
10. సీబీఎస్ఈ 12, 11, 10వ తరగతుల్లో నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు విడుదలౌతాయి. 40:30:30 శాతం ప్రకారం ఈ మార్కులను లెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)