CBSE 10th Result 2021: ఈ రోజే సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు?.. బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే
CBSE 10th Result 2021: ఈ రోజే సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు?.. బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల అవుతాయంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు అధికారికంగా ఫలితాల విడుదలపై స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10వ తరగతి ఫలితాలు ఈ రోజు విడుదల అవుతాయంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. ఈ రోజు ఫలితాలు విడుదల కావడం లేదంటూ బోర్డు అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇదిలా ఉంటే ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల అనేక సార్లు వాయిదా పడింది. జులై 20న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే, స్కూళ్లు మార్కుల జాబితా విడుదలలో ఆలస్యం చేయడంతో ఆ సమయంలో ఫలితాల విడుదల వాయిదా పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
సుప్రీంకోర్టు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల విడుదలకు జులై 31ని గడువుగా విధించడంతో ఆ ఫలితాలను విడుదల చేశారు. దీంతో సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అయితే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ వారంలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఫలితాలు అతి త్వరలోనే cbse.nic.in, cbse.gov.in, cbseresults.nic.in వెబ్ సైట్లలో విడుదల చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)