CBSE: సీబీఎస్ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలపై రేపు కీలక పాలసీ విడుదల.. వివరాలివే
CBSE: సీబీఎస్ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలపై రేపు కీలక పాలసీ విడుదల.. వివరాలివే
సీబీఎస్ఈ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఫలితాలపై అభ్యంతరాల విషయంలో పాలసీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పది, 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
పరీక్షలను నిర్వహించకపోవడంతో విద్యార్థులకు ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మార్కులను కేటాయించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
అయితే.. ఎవరైనా ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల నుంచి అందే వినతుల పరిశీలనకు పాలసీని సీబీఎస్ఈ రేపు విడుదల చేయనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఈ మేరకు రేపు పాలసీని విడుదల చేయనుంది. పాలసీకి అనుగుణంగా ఉన్న వినతులను మాత్రమే సీబీఎస్ఈ ఏర్పాటు చేసే కమిటీ పరిశీలించనున్నట్లు సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భరద్వాజ్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
మార్కులపై విద్యార్థుల నుంచి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన వినతులను పాలసీ విడుదల అనంతరం మాత్రమే స్వీకరించాలని సబీఎస్ఈ బోర్డు స్కూళ్లకు సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
పాలసీ విడుదలకు ముందు అందిన వినతులను పాలసీ విడుదలైన అనంతరం మళ్లీ మరోసారి అందించాలని సీబీఎస్ఈ సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
రేపు సాయంత్రంలోగా ఈ పాలసీని సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఇదిలా ఉంటే.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను జులై 30న విడుదల చేసింది. 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
టెన్త్ ఫలితాలను ఆగస్టు 3న విడుదల చేయగా 99.04 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.(ప్రతీకాత్మక చిత్రం)