2021లో, మొత్తం 2.30 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. అందులో దాదాపు 1.92 లక్షల మంది అభ్యర్థులు క్యాట్ పరీక్షకు హాజరయ్యారు. తొమ్మిది మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన వారిలో అందరూ అబ్బాయిలే ఉన్నారు. మహిళా టాపర్ 99.98 పర్సంటైల్ స్కోరు సాధించింది. 19 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్ స్కోర్లు సాధించారు.
గౌరవి కబడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) భువనేశ్వర్ పూర్వ విద్యార్థిని. MBA ప్రవేశ పరీక్ష-CAT 2021లో తన మొదటి ప్రయత్నంలోనే 99.95 పర్సంటైల్‌తో విజయం సాధించింది. 2020 బ్యాచ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చదువుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా తనకు లభించిన MNC ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం వదిలి IIMల నుండి మేనేజ్మెంట్ డిగ్రీని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. ఎక్కువ మాక్ టెస్టులు, టైం టేబుల్ ప్రిపరేషన్‌తో విజయం సాధించానని గౌరవి చెబుతుంది.
నీలే జైన్ MCom డిగ్రీ హోల్డర్. ఇతను CA ఉత్తీర్ణత సాధించాడు. క్యాట్ ద్వారా ఐఐఎం విద్యార్థిగా మారబోతున్నాడు. 23 ఏళ్ల జైన్ స్మార్ట్ ప్రిపరేషన్ ద్వారానే 99.98 పర్సంటైల్‌తో CATని క్రాక్ చేశానని చెబుతున్నాడు. పరీక్షలో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనే ఎక్కువగా స్టడీ మెటీరియల్ సేకరించానని నీలేజైన్ చెప్పుకొచ్చాడు. CAT ప్రిపేరయ్యే వారితో అప్డేట్ అవ్వడానికి మరియు స్టడీ మెటీరియల్‌లను షేర్ చేయడానికి టెలిగ్రామ్‌లోని అనేక ఛానెల్‌లలో చేరనని చెప్పాడు.
తన మొదటి ప్రయత్నంలోనే 99.99 పర్సంటైల్ సాధించాడు క్యాట్ 2021 టాపర్ యష్ మంధాన. కేవలం మాక్ టెస్ట్‌లను సాల్వ్ చేయడం ద్వారానే తన ప్రిపరేషన్ ఎక్కువగా ఉందని టాపర్ చెప్పాడు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన 22 ఏళ్ల అతను కేవలం ఐదు నెలల్లో మాత్రమే పరీక్షకు సిద్ధమయ్యాడని చెప్పాడు. ఐఐటీ బాంబే విద్యార్థి క్యాట్, జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్ మాత్రమే కాకుండా అనేక ఒలింపియాడ్‌లను కూడా సాధించాడు మరియు క్యాట్ ప్రిపరేషన్ తనకు చాలా కష్టంగా లేదని పేర్కొన్నాడు. అతను కూడా మాక్ టెస్ట్‌లపై ఆధారపడ్డాడు.
అహ్మదాబాద్‌కు చెందిన విరాజ్ షా క్యాట్ 2021లో 99.99 పర్సంటైల్ స్కోర్ చేయడం ద్వారా టాపర్ పేరును కైవసం చేసుకున్నారు. అతను మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి. మాక్ టెస్ట్‌లతో పాటు పరీక్ష కోసం తన స్నేహితులతో కలిసి చదువుకోవడం నిజంగా తనకు CAT 2021ని ఛేదించడానికి సహాయపడిందని అతను చెప్పాడు. "గ్రూప్ స్టడీలో, మేము టైమ్ మేనేజ్మెంట్, పేపర్లను ఎంత వేగంగా పరిష్కరించాలో చర్చించే వాళ్లమన్నాడు. నేను CAT కోసం నా పఠన వేగాన్ని(Reading Speed)) పెంచుకోవలసి వచ్చింది" అని వివరించాడు. విరాజ్.
CAT 2021లో 99.99 పర్సంటైల్ సాధించడం ద్వారా ధనేష్ భుతాడ కూడా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. క్యాట్ పరీక్షలో వేగం చాలా ముఖ్యమైందని చెబుతున్నాడు. ప్రశ్నలను పరిష్కరించడానికి మాకు రెండు నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటుంది. అందువల్ల సమయ నిర్వహణ చాలా ముఖ్యమైన విషయం. నేను రోజుకు 2-3 గంటలు చదువుకునేవాడిని మరియు ప్రతిరోజూ 90 నుండి 100 ప్రశ్నలను పరిష్కరించాను అని ధనేష్ చెప్పాడు.
99.99 పర్సంటైల్ సాధించడం ద్వారా CAT 2021లో ఉత్తీర్ణత సాధించిన హర్షిత్ కుమార్, పరీక్ష సన్నద్ధత కోసం ముగ్గురిలో చదువుకున్నాడు. IIT గాంధీనగర్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌ను అభ్యసిస్తున్న హర్షిత్, CAT కోసం, JEE మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల మాదిరిగా కాకుండా సమయ నిర్వహణ చాలా ముఖ్యమైనదని, ఇక్కడ విద్యార్థులు తమ కాన్సెప్ట్‌లను స్పష్టంగా కలిగి ఉండాలని మరియు సిలబస్ ఆధారిత పరీక్ష అని పేర్కొన్నారు.
CAT 2021 టాపర్ చిరాగ్ గుప్తా దేశంలోని అత్యంత కఠినమైన B-స్కూల్లో 100 పర్సంటైల్ సాధించాడు. అతను తన మొదటి ప్రయత్నంలోనే తన CATని క్లియర్ చేశాడు. ఇప్పుడు దేశంలోని అత్యుత్తమ IIMలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను మార్చి 2021లో తన సన్నద్ధతను ప్రారంభించాడు. సొంత ప్రిపరేషన్ ప్లాన్ ద్వారానే మనం సక్సెస్ అవుతామని ఆయన అన్నాడు.
ముంబైకి చెందిన 21 ఏళ్ల సోహమ్ కట్కర్ క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించాడు. అయితే ఇది అతని రెండో ప్రయత్నం. అతని మొదటి ప్రయత్నంలో అతను 99.6 పర్సంటైల్ స్కోర్‌ని పొందాడు. అయినప్పటికీ, అతని స్కోర్‌పై అసంతృప్తితో, అతను సెంచరీ పర్సంటైల్ పొందడానికి మళ్లీ పరీక్ష తీసుకున్నాడు. అతని డ్రాప్ సంవత్సరంలో, అతను బి-స్కూల్ ప్రవేశానికి సిద్ధం చేయడమే కాకుండా ఒక పుస్తకాన్ని రాశౄడు. వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాడు. మాక్ టెస్ట్‌లను సాల్వ్ చేయడం వల్ల ఏ ఔత్సాహికులకైనా రియాలిటీ చెక్ లభిస్తుందని ఆయన చెప్పారు.