గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఫ్రెషర్ గా ఉద్యోగం పొందడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంత మంది సులువుగానే తొలి ఉద్యోగం సాధిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఏళ్ల పాటు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే.. ఉద్యోగం పొందడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు నిరుత్సాహానికి గురవుతుంటారు అనేక మంది. ఇది ఉద్యోగం పొందాలనే కోరికను మరింత నిరుత్సాహపరుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు సులువుగా ఉద్యోగం సాధించడానికి ఓ 5 చిట్కాలు.. (ప్రతీకాత్మక చిత్రం)
1) సోషల్ మీడియా: ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే ముందు.. మీరు మీ సామర్థ్యం మరియు ఆసక్తి గురించి తెలుసుకోండి. మీరు ఫ్రెషర్ అయితే.. ఉద్యోగ సమాచారం అందుబాటులో ఉన్న వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్‌లలో చేరండి. మీలాగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఇతర మిత్రులను గుర్తించి వారితో మీరే ఓ గ్రూప్ క్రియేట్ చేయండి. ఇందుకోసం ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల సహాయం కూడా తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2) తిరస్కరణకు భయపడవద్దు: ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. ఉద్యోగ శోధన సమయంలో మీరు అనేక సార్లు ఇంటర్వ్యూలలో రిజక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీకు ఉద్యోగం ఎందుకు రావడం లేదో? ఏ కారణంతో మీరు తిరస్కరణకు గురవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే కానీ.. ఉద్యోగం రాలేదని బాధ పడకండి. (ప్రతీకాత్మక చిత్రం)
4) మోసాలకు గురికావద్దు: జాబ్ సైట్లలో అనేక రకాల ఉద్యోగ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే దరఖాస్తు చేసుకునే ముందు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోండి. అధికారిక వెబ్ సైట్లను మాత్రమే సంప్రదించండి. లేకపోతే, మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాం అనే మాయలో పడకండి. (ప్రతీకాత్మక చిత్రం)