1. 2021లో 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. గణితం (Maths) లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను కోర్ సబ్జెక్ట్‌లుగా(Subjects) తీసుకుని ఈ సంవత్సరం బోర్డు పరీక్షకు(Board Exam) హాజరవుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. విద్యార్థులు hcltechbee.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి TechBee ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ HCL CATకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. అనంతరం హెచ్‌సీఎల్ ఆఫర్ లెటర్‌ను విద్యార్థులకు పంపనుంది. శిక్షణా కోసం ప్రతి విద్యార్థి పన్నులతో కలిపి రూ.1 లక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు, తెలంగాణ హైకోర్టు జాబ్స్, హైకోర్టులో ఉద్యోగాలు, హైకోర్టులో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ జాబ్స్" width="1200" height="800" /> 3. హెచ్‌సీఎల్ క్యాట్ పరీక్ష.... క్వాంటిటేటివ్ రీజనింగ్ (గణితం), లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ని తనిఖీ చేయడానికి రూపొందించిన ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్. 12వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గ్లోబల్ కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కోర్సు ఫుల్ టైమ్ ఉద్యోగ హామీని అందిస్తుంది. టెక్బీకి ఎంపికైన అభ్యర్థులు లైవ్ హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్‌ల్లో ఇంటర్న్‌షిప్ సమయంలో రూ.10,000 స్టైపెండ్ పొందనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒక-సంవత్సరం శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, డిజైన్ ఇంజనీర్ లేదా డిజిటల్ ప్రాసెస్ అసోసియేట్ వంటి హోదాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ హోదా బట్టి విద్యార్థులు సంవత్సరానికి రూ. 1.70 - 2.20 లక్షల మధ్య జీతం పొందనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
వైసీపీ జాబ్ మేళా, విజయసాయిరెడ్డి, వైసీపీ జాబ్ మేళా" width="1600" height="1600" /> 5. ఈ కోర్సుకు సంబంధించి హెచ్‌సీఎల్ కీలక ప్రకటన చేసింది. ‘ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాల కోసం ఈ కోర్సు విద్యార్థులను సాంకేతికంగా, వృత్తిపరంగా సిద్ధం చేస్తుంది. అందుకు అనుగుణంగా అభ్యర్థులు విస్తృతమైన 12-నెలల శిక్షణ తీసుకోనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతేకాకుండా హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్‌లలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. హెచ్‌సీఎల్‌లో పనిచేస్తున్నప్పుడు, విద్యార్థులు బిట్స్ పిలానీ, శాస్త్రా యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీలు అందించే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడానికి నమోదు చేసుకోవచ్చు." అని హెచ్‌సీఎల్ పేర్కొంది. ఇందుకోసం కొంత ఫీజును సైతం హెచ్‌సీఎల్ చెల్లించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గ్లోబల్ కస్టమర్ల కోసం పని చేయడంతో పాటు, టెక్బీ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు పుల్ టైమ్ హెచ్‌సీఎల్ ఉద్యోగులుగా మారనున్నారు. దీంతో ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, అలాగే ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల శ్రేణిని కవర్ చేసే అన్ని హెచ్‌సీఎల్ ప్రయోజనాలు వీరు పొందునున్నారని ఐటీ దిగ్గజం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గ్లోబల్ కస్టమర్ల కోసం పని చేయడంతో పాటు, టెక్బీ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన అభ్యర్థులు పుల్ టైమ్ హెచ్‌సీఎల్ ఉద్యోగులుగా మారనున్నారు. దీంతో ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, అలాగే ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల శ్రేణిని కవర్ చేసే అన్ని హెచ్‌సీఎల్ ప్రయోజనాలు వీరు పొందునున్నారని ఐటీ దిగ్గజం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)