తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కానిస్టేబుల్ పరీక్షను ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా ఎగ్జామ్ను వారం రోజులు వాయిదా వేసింది. 2022 ఆగస్ట్ 28న ఈ ఎగ్జామ్ జరగనుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను రేపటి నుంచి www.tslprb.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్, మెకానిక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)