1. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 285 ఖాళీలను ప్రకటించింది. ఎయిర్‌వింగ్, పారామెడికల్ స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. ఈ మూడు విభాగాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 285 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్- 49, అసిస్టెంట్ రేడియో మెకానిక్- 8, కానిస్టేబుల్- 8, స్టాఫ్ నర్స్- 74, ఏఎస్ఐ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్- 2, ఏఎస్ఐ ల్యాబరేటరీ టెక్నీషియన్- 56, విజిల్- 18, హెచ్‌సీ (వెటర్నరీ)- 40, కానిస్టేబుల్ (కెన్నెల్మ్యాన్)- 30 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థులు https://rectt.bsf.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఎయిర్‌వింగ్, పారామెడికల్ స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్ నోటిఫికేషన్లు వేర్వేరుగా ఉంటాయి. View Details పైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Here పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)