1. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బయటపెట్టిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాలు హ్యాకింగ్ అయ్యాయన్న కారణంగా మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ రెండు రోజుల క్రితం ప్రకటన జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. దీంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షల ప్రశ్నాపత్రాలు మాత్రమే కాదు మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షాపత్రం కూడా లీక్ అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సరిగ్గా పరీక్షకు రెండు రోజుల ముందు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు పోలీసులు నిర్థారించారు. దీంతో ఇప్పటికే ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడటంతో మార్చి 5న జరిగిన పరీక్ష రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తారా అన్న చర్చ జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ ఉన్నారు. వీరితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీలో సూత్రధారిగా వ్యవహరించిన రేణుకతో పాటు ఆమె భర్త, సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రశ్నాపత్రాలు లీక్ చేసినవాళ్లు మాత్రమే కాదు, ఈ ఎగ్జామ్ పేపర్స్ కొన్న ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు ఇంతటితో ఆగేలా లేదు. పోలీసులు తీగలాగుతున్నకొద్దీ డొంక మరింత కదిలేలా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)