భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ షిప్ ట్రైనింగ్ అందుకుంటారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
ఖాళీలు, అర్హతల వివరాలు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
ఇందులో మెకానికల్ విభాగంలో 20, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో 10, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11, 110 ని స్కాలర్ షిప్ గా అందించనున్నారు. బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
ఏఐసీటీఈ లేదా భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2018 నవంబర్ 30లోగా ఈ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
అభ్యర్థుల వయస్సు 2021 నవంబర్ 30లోగా 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
బీఈ/బీటెక్ కోర్సుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
నోటిఫికేషన్ లింక్: https://bel-india.in/Documentviews.aspx?fileName=ADVT-Graduate-English-09-08-2021.pdf అధికారిక వెబ్ సైట్: https://bel-india.in/Default.aspx