బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (BECIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ మరియు ఆఫీస్ అటెండెంట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో (Job Notification) పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ becil.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెండరింగ్ ప్రొఫెషనల్ విభాగంలో 12, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్ విభాగంలో 12, ఆఫీస్ అటెండెంట్ విభాగంలో 6, మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
దరఖాస్తు రుసుము: జనరల్ / OBC / మాజీ-సర్వీస్మెన్ / మహిళా అభ్యర్థులు రూ. 885 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, అయితే SC / ST / EWS / PH కేటగిరీ అభ్యర్థులకు రూ. 531 వర్తిస్తుంది. వయోపరిమితి: ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్/ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్: 50 సంవత్సరాలు, ఆఫీస్ అటెండెంట్: 21 సంవత్సరాలు. (ప్రతీకాత్మక చిత్రం)