1. హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 46 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 జూలై 8న ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తం 46 ఖాళీలు ఉండగా అందులో జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (న్యూ ప్రాజెక్ట్స్)- 3, మెడికల్ ఆఫీసర్- 2, అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)- 3, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్)- 12, మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్)- 9, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 3, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్)- 3, మేనేజ్మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్)- 2, మేనేజ్మెంట్ ట్రైనీ (ఆప్టిక్స్)- 1, మేనేజ్మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్మెంట్)- 1, మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)- 3, మేనేజ్మెంట్ ట్రైనీ (హెచ్ఆర్)- 3 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, బీడీఎల్ ఉద్యోగులకు ఫీజు లేదు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇతర పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)