Jobs In Banks: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..
Jobs In Banks: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..
ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలతో పాటు.. పలు రకాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదల అవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా సాగుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలతో పాటు.. పలు రకాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదల అవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా సాగుతున్నారు.
2/ 7
ఇక తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 225 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.
3/ 7
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే జనవరి 23న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
4/ 7
మొత్తం 29 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితిని 25-35 ఏళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://bankofmaharashtra.in/ను ఓపెన్ చేయాలి. : అనంతరం హోం పేజీలో Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
6/ 7
తర్వాత Recruitment Process విభాగంలో Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ కింద Registration Link ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ పేజీలో వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
7/ 7
చివరగా దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపుడుతంది. ప్రింట్ తీసుకున్న దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)