1. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ని (IT Professionals) నియమించుకుంటోంది. మొత్తం 15 ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని (Specialist Officer Jobs) భర్తీ చేస్తోంది. బ్యాంక్స్ అనలిటికల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ పోస్టులకు 2021 నవంబర్ 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 6 చివరి తేదీ. బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు అనుభవం కూడా తప్పనిసరి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం ఖాళీలు 15 ఉండగా అందులో డేటా సైంటిస్ట్ పోస్టులు 9, డేటా ఇంజనీర్ పోస్టులు 6 ఉన్నాయి. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. ఎంపికైనవారికి రూ.69,180 నుంచి రూ.89,890 మధ్య వేతనం లభిస్తుంది. (Source: Official Notification)
4. డేటా సైంటిస్ట్ పోస్టులకు అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ పాస్ కావాలి. వయస్సు 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. డేటా ఇంజనీర్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. వయస్సు 25 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. Current Opportunities క్లిక్ చేస్తే Recruitment Of IT Specialist Officers నోటిఫికేషన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)