కరోనా సమయంలో దాదాపు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) చేశారు. ఈ కాలంలో వాళ్లందరూ ఇంటి నుంచే పని చేయడానికి బాగా అలవాటు పడ్డారు. కోవిడ్-19 తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగుల (Employees)ను ఆఫీసుల (Offices)కు రప్పించడం కంపెనీలకు అసాధ్యంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
అందుకే కంపెనీలు ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేలా ప్రోత్సహించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పబ్ లేదా రెస్టారెంట్లో వీక్లీ మీటింగ్స్ పెట్టడం నుంచి కొత్త తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకురాగల ఆఫీస్‌లను ఏర్పాటు చేయడం వరకు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీలు కూడా ఎక్కువ మందిని తిరిగి ఆఫీసుకు వచ్చేలా ప్రోత్సహించడానికి వ్యూహాలను రూపొందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఐటీ వంటి రంగాలలో అట్రిషన్ అత్యధికంగా ఉన్నా కూడా ఉన్నతమైన విధానం కంటే ఆఫీస్‌లకు వచ్చేలా ఉద్యోగులను ప్రేరేపించడమే కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వచ్చేలా చేయడానికి మెరుగైన వ్యూహాన్ని రచించేందుకు కన్సల్టెంట్లను కూడా నియమించుకోవడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
ఉద్యోగుల సూచనలకు ఆహ్వానం
“రిమోట్ వర్క్‌తో కంపెనీ బాగానే ఉన్నప్పటికీ, సరైన ప్రొడక్టివిటీ కోసం సామాజిక సమానత్వాన్ని పునరుద్ధరించడం, సృష్టించడం చాలా అవసరమని మేం నమ్ముతున్నాం. దీని కోసం వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడం బాగా సహాయపడుతుంది. ఉద్యోగులతో కలిసి తిరిగి పని చేయడానికి ఒక విధానాన్ని ఆలోచించాం. గొప్ప ఆలోచనలు, సూచనలను పొందాం. ఈ పరిష్కారాలలో కొన్నింటిని అమలు చేయడానికి కృషి చేస్తున్నాం, ”అని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ కంపెనీలో ప్రస్తుతం 94% మంది ఉద్యోగులు రిమోట్ లొకేషన్ల నుంచి పని చేస్తున్నారు. అయితే రాబోయే మూడు లేదా నాలుగు నెలల్లో దీనిని పెంచాలని చూస్తోంది. ఈ మేరకు సలహాలు కూడా ఇవ్వాలని కంపెనీ ఉద్యోగులను కోరుతోంది. “కేవలం మూడేళ్లలో వర్క్‌ఫోర్స్ సరిహద్దులు లేని కెరీర్ల వైపు కదులుతోంది. ఉద్యోగులు ఎక్కడి నుండైనా పని చేసే సదుపాయాన్ని పొందుతున్నారు.” అని విప్రో ప్రతినిధి ఒకరు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఇన్ఫోసిస్, విప్రోతో సహా చాలా కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను భవిష్యత్తులో కూడా కొనసాగించనున్నాయి. అనేక ఇతర పెద్ద కంపెనీలు కూడా ఈ మోడల్లను కొనసాగించాలని చూస్తున్నాయి. ఐతే నిర్దిష్ట ఫంక్షనల్ హెడ్లు, ఉద్యోగులు కనీసం ఒక్కసారైనా కార్యాలయానికి రావాల్సి ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)