1. యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్, నోయిడాలోని ఎమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఒప్పందం కుదుర్చుకొని యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్-ABYBP అందిస్తోంది. ఇది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అల్లైజడ్ సర్వీసెస్, సేల్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, రీటైల్ బ్యాంకింగ్ సేల్స్, డిజిటల్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్ లాంటి అంశాల్లో శిక్షణ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎంబీఏ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌తో త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)