1. అస్సాం రైఫిల్స్ జనరల్ డ్యూటీ విభాగంలో రైఫిల్‌మ్యాన్, రైఫిల్వుమెన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 131 ఖాళీలను ప్రకటించింది. పురుషులకు 75, మహిళలకు 56 పోస్టులున్నాయి. డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూలై 25 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆగస్ట్ 24 నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది అస్సాం రైఫిల్స్. ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం ఈ పోస్టుల్ని ప్రకటించింది అస్సాం రైఫిల్స్. కరాటే, జూడో, ఫుట్‌బాల్, బాక్సింగ్ లాంటి క్రీడల్లో రాణించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)