ASHWINI VAISHNAW MINISTER OF RAILWAYS OF INDIA ANNOUNCED 265547 JOB VACANCIES IN RALIWAYS HERE FULL DETAILS NS
Railway Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 2.65 లక్షల జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?
నిరుద్యోగులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw, Minister of Railways of India) శుభవార్త చెప్పారు. 2.65 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు(Railway Jobs) ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ధీటుగా రైల్వే జాబ్స్ కు సైతం విపరీతంగా పోటీ ఉంటుంది. ఈ కలల కొలువును సొంతం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక్క సారి రైల్వేలో చేరితో ఇక తమకు తిరుగు ఉండదని భావించడమే ఇందుకు కారణం.
2/ 7
అయితే.. ఇలాంటి రైల్వే ఉద్యోగ ఖాళీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 2,65,547 ఖాళీలు ఉన్నట్లు పార్లమెంట్ లో వెల్లడించారు. సీపీఎం సభ్యుడు సదాశివన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా బదులు ఇచ్చారు.
3/ 7
ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆయా నియామక సంస్థలకు ఇండెంట్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఖాళీల్లో 2,177 గెజిటెడ్, 2,63,370 నాన్ గెజిటెడ్ ఖాళీలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
4/ 7
తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సౌత్ సెంట్రల్ రైల్వేలో 43 గెజిటెడ్, 16,741 నాన్ గెజిటెడ్ ఖాళీలు కలిపి మొత్తం 16,784 ఖాళీలు ఉన్నట్లు ఆయన వివరించారు.
5/ 7
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా గత ఐదేళ్లలో వివిధ జోన్లతో కలిపి గ్రూప్-సీ లెవల్-1 పోస్టులు 76,128, మొత్తం 1,89,790 ఖాళీలను భర్తీ చేసినట్లు రైల్వే మంత్రి వివరించారు.
6/ 7
తాజాగా సెంట్రల్ రైల్వే (Central Railway) భారీగా అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2422 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల (Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 17 నుంచి ప్రారంభమైంది.
7/ 7
దరఖాస్తుకు ఫిబ్రవరి 16ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ rrccr.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.