TS 10th Exams 2022:రెండేళ్ల తర్వాత తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రం వ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ కోసం 2861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5.09లక్షల మంది ఎగ్జామ్స్‌కి హాజరవుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగూణంగానే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
సోమవారం నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని సారించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు రాయకపోవడంతో ఆయా ఎగ్జామ్స్ సెంటర్స్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
2/ 14
ఇప్పటికే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిశాయి. వోకేషనల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. 23వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికార యంత్రాంగం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది.
3/ 14
సాధారణంగా పదవ తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లు ఉండగా, ఈ సారి వాటి సంఖ్యను ఐదింటికి కుదించి, సెలబస్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 23వ తేది నుండి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
4/ 14
ఆదిలాబాద్ జిల్లాలోని 242 పాఠశాలల నుండి 11 వేల 252 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హజరు కానుండగా, నిర్మల్ జిల్లాలోని 231 పాఠశాలల నుండి 9693 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలోని 360 పాఠశాలలకు చెందిన పది వేల 659 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
5/ 14
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 166 పాఠశాలల నుండి 7393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవకతవలకు తావివ్వకుండా పర్యవేక్షణ కోసం సిసి కెమెరాలను అమర్చి నిఘాను ఏర్పాటు చేశారు.
6/ 14
వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి వసతిని సమకూర్చడంతోపాటు వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
7/ 14
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి ఆదిలాబాద్ జిల్లాలోని 11 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల సమయంలో జిల్లా వ్యాప్తంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు.
8/ 14
ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమవేశమై పరీక్షల ఏర్పాట్లను సమీక్షించి, పరీక్షా సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను సూచించారు.
9/ 14
మరోవైపు కోవిడ్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లోని తరగతి గదులను శానిటైజ్ చేశారు. మరుగుదొడ్లను శుభ్రం చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ, ఎస్.పి. ప్రవీణ్ కుమార్ ఆ జిల్లాలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
10/ 14
పరీక్షా సమయంలో ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుజాగ్రత్తగా పోలీసు యంత్రాంగం ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేస్తోంది.
11/ 14
టెన్త్ పరీక్షల నిర్వాహణ కోసం ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు జిల్లా ఉన్నతాధికారులు. మొత్తంమీద రెండేళ్ళ తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠకు లోనవుతున్నారు.
12/ 14

13/ 14
ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమవేశమై పరీక్షల ఏర్పాట్లను సమీక్షించి, పరీక్షా సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను సూచించారు.
14/ 14
టెన్త్ పరీక్షల నిర్వాహణ కోసం ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు జిల్లా ఉన్నతాధికారులు. మొత్తంమీద రెండేళ్ళ తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠకు లోనవుతున్నారు.