1. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (PRT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల భర్తీకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్మీ స్కూళ్లల్లో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించినా ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత స్కూళ్ల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. పీజీటీ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. టీజీటీ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. (image: AWES notification)
5. పీఆర్టీ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు ఫ్రెషర్‌కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పోస్టులకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ జరుగుతుంది. 2022 ఫిబ్రవరి 28న ఫలితాలు విడుదలవుతాయి. అభ్యర్థులు https://register.cbtexams.in/AWES/Registration వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత Registration పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)