1. భారతదేశంలో ఫెస్టివల్ సీజన్ మొదలైతే చాలు పార్ట్ టైమ్ ఉద్యోగాల నియామకాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ తరహా ఉద్యోగాల నియామకాలు పెరిగిపోయాయి. ప్రధానంగా లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. 99 పాన్‌కేక్స్ కంపెనీ ముంబైలోని ఓషివారాలోని 99 పాన్‌కేక్స్ స్టోర్‌లో నియమించేందుకు ఫ్రెషర్/ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది కోసం సెర్చ్ చేస్తోంది. ఈ ఉద్యోగం సంపాదించిన వారు ముంబైలో పాన్కేక్లు, వాఫ్ఫల్స్, క్రేప్స్, షేక్స్, కేకులు విక్రయించాలి. ఎంపికైన అభ్యర్థులు వారానికి 54 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు Indeed.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. Decathlon Sport India Pvt Ltdలో సేల్స్ & మార్కెటింగ్ ఉద్యోగాల నియామకం జరుగుతుంది. దీనికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లోకల్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ (LSP)ని బిల్డ్ చేయాలి. క్యాచ్మెంట్ అనాలసిస్ ప్రకారం పరిధిని ఎంచుకోవాలి. అలానే మర్చండైజింగ్, స్టాక్‌తో పాటు పైలటింగ్, స్పోర్ట్ PNL మార్జిన్, ష్రింకేజ్ హ్యాండిల్ చేయాలి. ఈ కంపెనీ చెన్నై, నవలూరులో మూడు నెలల పార్ట్‌టైమ్ జాబ్ అభ్యర్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్ చెల్లిస్తుంది. ఇంటర్న్‌షాలా అధికారిక వెబ్సైట్లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పుణేలోని హెన్నెస్ & మారిట్జ్ (H&M) గ్రూప్ వారానికి కనీసం 24 గంటలు.. గరిష్ఠంగా వారానికి 6 రోజుల వరకు పని చేయడానికి ఇష్టపడే పార్ట్ టైమ్ సేల్స్ అడ్వైజర్ కోసం వెతుకుతోంది. ఎంపికైన వారు కస్టమర్లకు ఫిట్టింగ్ రూమ్, సేల్స్ ఫ్లోర్, క్యాష్ పాయింట్లో సేవలను అందించాలి. కస్టమర్లు అందంగా కనిపించడానికి సరైన దుస్తులను సెలెక్ట్ చేసుకోవడంలో సహాయం చేయాలి. డెలివరీలను ప్రాసెస్ చేయాలి, స్టాక్ రీప్లెనిష్మెంట్, ఫ్లోర్‌పై లేటెస్ట్ గార్మెంట్స్ మర్చండైజింగ్‌లో సహాయం చేయాలి. ఆసక్తి ఉన్నవారు Indeed.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముంబైకి చెందిన కల్కి ఫ్యాషన్ కంపెనీ రిటైల్ వాతావరణంలో కస్టమర్ సర్వీస్/రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ ప్రాసెస్‌కు సంబంధించి టెక్నికల్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కోసం వెతుకుతోంది. ఈ పార్ట్-టైమ్ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు లింక్డ్ఇన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. గురుగ్రామ్‌కి చెందిన noon.com కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ పొందాలంటే అభ్యర్థులు స్ట్రాంగ్ కస్టమర్ రిలేషన్స్ పెంపొందించుకోవాలి. ఈ-మెయిల్ ద్వారా కస్టమర్ల ప్రశ్నలను పరిష్కరించాలి. దరఖాస్తుదారులకు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ-కామర్స్ ఫీల్డ్‌లో తప్పనిసరిగా ఆరు నెలలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు లింక్డ్ఇన్లో ఉద్యోగం కోసం నమోదు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. టామీ హిల్ఫిగర్ (Tommy Hilfiger)లో క్లయింట్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారు క్లయింట్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. చెన్నై, పుణే, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, కొచ్చిన్లతో సహా పలు ప్రాంతాల్లోని టామీ హిల్ఫిగర్ ఆఫీసుల్లో 40 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇంటర్న్‌షాలాలో ఈ నాలుగు నెలల ఇంటర్న్‌షిప్ కోసం అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000 స్టైఫండ్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)