Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో ఉద్యోగాలు... ఎల్లుండి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో ఉద్యోగాలు... ఎల్లుండి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్లో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా నీమ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది కియా మోటార్స్. మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 3-4-875/A/1, చెరుకుపల్లి, తగరపువలస బ్రిడ్జి దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-500027. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. అభ్యర్థులు 2021 మార్చి 30న జరిగే ఆన్లైన్ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్హతల వివరాలు చూస్తే ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. 2016 నుంచి 2020 మధ్య పాస్ అయిన అభ్యర్థులే దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి రూ.14,000 నుంచి రూ.15,000 వరకు వేతనం లభిస్తుంది. (Source: APSSDC Twitter)
6/ 8
6. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో జరిగే డ్రైవ్‌కు, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగే డ్రైవ్‌కు హాజరు కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. ఈ జాబ్ నోటీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్సైట్లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)