1. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరిన్ని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా 25 గెజిటెడ్ పోస్టుల్ని ఏపీపీఎస్సీ భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్స్ ద్వారా నాన్ గెజిటెడ్ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 28 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, ఖాళీల సంఖ్య తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 25 ఖాళీలు ఉండగా అందులో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఏఫీ ఫిషరీస్ సర్వీస్) పోస్టులు 11 ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930 వేతనం లభిస్తుంది. సెరీకల్చర్ ఆఫీసర్ (సెరీకల్చర్ సర్వీస్) పోస్టు 1 ఉంది. సెరీకల్చర్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ సెకండ్ ప్లాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి. రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 వేతనం లభిస్తుంది. (Source: Official Notification)
4. అగ్రికల్చర్ ఆఫీసర్ (అగ్రికల్చర్ సర్వీస్) పోస్టులు 6 ఉన్నాయి. బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930 వేతనం లభిస్తుంది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్) పోస్టులు 2 ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్) పోస్టు 1 ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి. రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 వేతనం లభిస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ (ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్) పోస్టులు 3 ఉన్నాయి. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 28 నుంచి 42 ఏళ్లు ఉండాలి. రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టీకల్చర్ సర్వీస్) పోస్టు 1 ఉంది. ఎంఎస్సీ హార్టీకల్చర్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970 వేతనం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజ్ రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి. యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)