ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత పొంది ఉండాలి.
అయితే.. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, Geology-భూగర్భ శాస్త్రం , హార్టికల్చర్, మాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజ సబ్జెక్టుల్లో డిగ్రీ చేసి ఉండాలి. ఇంకా అభ్యర్థులు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.