APPLY FOR TSRJC CET 2020 TO GET INTERMEDIATE ADMISSIONS IN TELANGANA GURUKUL JUNIOR COLLEGES APPLICATION PROCESS ENDS ON SEPTEMBER 5 SS
TSRJC CET 2020: గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
TSRJC CET 2020 | తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందాలనుకునేవారికి మరో రెండు రోజులే అవకాశముంది. TSRJC CET 2020 ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు.
1. తెలంగాణలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 రాయడానికి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. వాస్తవానికి ఈ పరీక్షకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువు గతంలోనే ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ-TREIS. ఇప్పుడు మరోసారి దరఖాస్తు గడువును పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఆసక్తి గల విద్యార్థులు 2020 సెప్టెంబర్ 5 వరకు టీఎస్ఆర్జేసీ సెట్ 2020 కి అప్లై చేయొచ్చు. ఇక పరీక్షను కూడా వాయిదా వేసింది TREIS. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 మే 10న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ ఎగ్జామ్ వాయిదా పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఇప్పటికీ పరీక్ష నిర్వహంచే అవకాశం లేదు కాబట్టి దరఖాస్తు చేయడానికి విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది TREIS. టెన్త్ పాసైన విద్యార్థులు గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. TSRJC CET 2020 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. టెన్త్ విద్యార్థులు TSRJC CET 2020 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)