ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల్లో అంటే.. ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది. ఇంకా.. సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రైవేటు విద్యార్థులు 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు - 147 మంది పరీక్షలకు ఫీజు చెల్లించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. పరీక్షల నిర్వహణకు 3449 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా.. 682 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇదిలా ఉంటే.. పరీక్షల విషయం విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
సైన్స్ సబ్జెక్ట్ పరీక్ష సమయంలో రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఆన్సర్ బుక్లెట్లు విద్యార్థులకు ఒకేసారి ఇస్తారు. ఆన్సర్లను విద్యార్థులు వేర్వేరు ఆన్సర్ షీట్లపై రాయాల్సి ఉంటుంది. అయితే.. వాటిని రాసే క్రమంలో ఏదైనా పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)