ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఎగ్జామ్స్ ఈ నెల 6న ముగిసిన విషయం తెలిసిందే. అయితే సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్న అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది విద్యాశాఖ. వాల్యుయేషన్ ప్రక్రియ ఈ రోజు అంటే ఆదివారంతో ముగియనుంది.