మరికొన్ని గంటల్లో ఏపీలో పదో తరగతికి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను విడుదల చేస్తారు. వాస్తవానికి ఈ ఫలితాలు ఈ నెల 4నే విడుదల అవ్వాల్సి ఉంది. అయితే.. విద్యాశాఖ మంత్రి అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఫలితాల విడుదలను ఆ సమయంలో వాయిదా వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా ఈ నెల 6న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ. విద్యార్థులు తమ రిజల్ట్స్ ను https://telugu.news18.com/news/career/board-results/ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ నుంచి కూడా విద్యార్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. ఈ సారి పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటించనున్నారు. ర్యాంకులను మాత్రం విద్యాశాఖ ప్రకటించడం లేదు. గత రెండేళ్లుగా గ్రేడింగ్ పద్ధతికి బదులుగా మార్కులను మాత్రమే ప్రకటిస్తోంది విద్యాశాఖ. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు జగన్ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏ విద్యాసంస్థ అయినా తమ విద్యార్థికి ఫలానా ర్యాంకు వచ్చిందని ప్రకటనలు ఇస్తే మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విద్యాశాఖ హెచ్చరించింది. కొన్ని పాఠశాలలు ర్యాంకులను చూపెట్టి విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. (ప్రతీకాత్మక చిత్రం)