ఏపీలో ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఈ రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
సుప్రీంకోర్టు సూచనలతో జూన్ 25న పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు మార్కుల కేటాయింపునకు అనుసరించాల్సిన విధానం కోసం కమిటీని ఏర్పాటు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
కమిటీ నివేదిక ప్రకారం టెన్త్ మార్కులకు 30 శాతం వెయిటేజీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇచ్చి ఫలితాలను విడుదల చేశారు అధికారులు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే.. గతంలో ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయి ఈ సారి సెకండియర్ పరీక్షలతో పాటు ఫీజు చెల్లించిన వారికి 35 శాతం మార్కులతో ఆయా సబ్జెక్టుల్లో పాస్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5,08,672 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. దీంతో వీరందరినీ పాస్ చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందులో 2,53,138 మంది బాలురు, 2,55,534 మంది బాలికలు ఉన్నట్లు వివరించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అయితే.. ఈ ఫలితాలతో సంతృప్తి చెందని వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
విద్యార్థులు http://results.bie.ap.gov.in/, http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)