1. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలు (AP Inter Resluts 2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లేదా ఏపీ పరీక్ష ఫలితాల వెబ్సైట్ https://examresults.ap.nic.in/ లల్లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. న్యూస్18 తెలుగు వెబ్సైట్ https://telugu.news18.com/ లో రిజల్ట్స్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,41,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,45,358 ఉండగా, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,23,455 ఉన్నారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు 72,299 ఉన్నారు. ఫస్టియర్లో 2,41,599 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ ఉత్తీర్ణత 54 శాతం. సెకండ్ ఇయర్లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్ ఉత్తీర్ణత 61 శాతం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫస్టియర్లో 49 శాతం మంది బాలురు, 65 శాతం మంది బాలికలు పాస్ కాగా, సెకండియర్లో 59 శాతం మంది బాలురు, 68 శాతం మంది బాలికలు పాసయ్యారు. ఫస్టియర్, సెకండియర్లో బాలికల పాస్ పర్సెంటేజీ ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా చూస్తే కృష్ణా జిల్లా 75 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా కడప జిల్లా 55 శాతంతో చివరి స్థానంలో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)