1. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల (AP Inter Results 2022) కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ (AP Inter 1st Year Results), ఇంటర్ సెకండ్ ఇయర్ (AP Inter 2nd Year Results) ఫలితాలను ప్రభుత్వ వెబ్‌సైట్స్‌తో పాటు https://telugu.news18.com/ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లేదా ఏపీ పరీక్ష ఫలితాల వెబ్సైట్ https://examresults.ap.nic.in/ లల్లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. వీటితో పాటు న్యూస్18 తెలుగు వెబ్సైట్ https://telugu.news18.com/ లో రిజల్ట్స్ చూడొచ్చు. మరి News18 Telugu వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ముందుగా https://telugu.news18.com/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్, ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ ఆప్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. విద్యార్థులు తమకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ప్రభుత్వ వెబ్‌సైట్స్ అయిన https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in/ లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ముందుగా https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ పైన ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించిన లింక్స్ వేర్వేరుగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్థులు తమకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయాలి. జనరల్ విద్యార్థులు జనరల్ లింక్‌పై, వొకేషనల్ విద్యార్థులు వొకేషనల్ లింక్‌పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)