1. ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు రోజుల క్రితమే హాల్ టికెట్స్ వచ్చాయి. అయితే ఈ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE). దీంతో ఈ విధానాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో జంబ్లింగ్ విధానం సరికాదంటూ పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇంటర్ విద్యార్థులకు వారు చదువుతున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒక కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల కోసం మరో కాలేజీకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని విద్యార్థులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. కాబట్టి పాత పద్ధతిలో అంటే ఏ కాలేజీలోని విద్యార్థులకు అదే కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అంతకన్నా ముందే కళాశాలల్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తుంది ఇంటర్ బోర్డు. ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్స్‌ను రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏపీ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో ఈ హాల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్న విధానాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడంతో మరోసారి హాల్ టికెట్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్ కోసం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. హోమ్ పేజీలో Download Practical Hall Tickets March 2022 పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మార్చి 2022 కి సంబంధించిన రోల్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Download Hall Ticket పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. విద్యార్థులు రోల్ నెంబర్‌ను తమ కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి పొందొచ్చు. లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌తో కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయొచ్చు. ఈ హాల్ టికెట్స్ కేవలం 2022 మార్చిలో జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించినవి మాత్రమే. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరగబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి. వీటిని కూడా ఏపీ ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ https://bie.ap.gov.in/ లో డౌన్లోడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)