1. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 90 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌కు హాల్ టికెట్స్ ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 26 నుంచి 7 వరకు రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక వొకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్థులు పరీక్ష మొదలయ్యే సమయానికి హాల్‌కు చేరుకోవాలి. 10 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. పరీక్షా హాల్‌కు హాల్ టికెట్, ప్రాజెక్ట్ వర్క్, రికార్డ్‌తో రావాలి. ప్రాజెక్ట్ వర్క్, రికార్డ్ తీసుకురాకపోతే వాటికి కేటాయించిన మార్కుల్ని తగ్గిస్తారు. మార్కుల వివరాలు చూస్తే జనరల్ కోర్సులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్, వొకేషనల్ కోర్స్ విద్యార్థులకు 50 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఏపీ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ చూస్తే 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు చూస్తే మార్చి 15 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 17 ఇంగ్లిష్ పేపర్-1, మార్చి 20 మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1... మార్చి 23 మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మార్చి 25 ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1, మార్చి 28 న కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1, మార్చి 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు), ఏప్రిల్ 3న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1 పరీక్షలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ చూస్తే మార్చి 16న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2, మార్చి 18న ఇంగ్లిష్ పేపర్-2, మార్చి 21 న మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2, మార్చి 24న మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.. మార్చి 27న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 29న కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2, ఏప్రిల్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).. ఏప్రిల్ 4 న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)