ఏపీలో మే 6 వ తేదీ నుంచి 24 మే వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆయా పరీక్షలకు సంబంధించిన ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని పరీక్షా పేపర్లకు సంబంధించిన వాల్యుయేషన్ పూర్తయినట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో ఈ నెల 15న అంటే బుధవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఏదైనా కారణాలతో ఫలితాలను ఈ నెల 15న విడుదల చేయకపోతే ఈ నెల మూడో వారంలో తప్పనిసరిగా ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తున్నట్లు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే.. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన కీలక అప్ డేట్ రానే వచ్చింది. సాధ్యమైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించాలన్న లక్ష్యంతో సాగుతోన్న ఇంటర్ బోర్డ్ కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 14 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తుండగా.. ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో మూల్యాంకనం పూర్తయింది. (ప్రతీకాత్మక చిత్రం)
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 15న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంటర్ బోర్డ్ నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిసిన 20 రోజుల్లో వారి ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)