ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. దీనిలో ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను జిల్లా కోర్డుల్లో(District Courts) ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
1. అనంతపురం-92, 2.చిత్తూరు- 168, 3.తూర్పు గోదావరి -156, 4.గుంటూరు - 147, 5.వైఎస్ఆర్ కడప-83, 6. కృష్ణ - 204, 7.కర్నూలు - 91, 8. నెల్లూరు - 104, 9.ప్రకాశం - 98, 10. శ్రీకాకుళం - 87,
11.విశాఖపట్నం - 125, 12.విజయనగరం - 57, 13. పశ్చిమగోదావరి - 108 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీలు 1520 ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గత నెల 22న ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తులను (https://cdn3.digialm.com/EForms/configuredHtml/2381/78972/Index.html) సమర్పించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఇలా.. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీనిలో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అర్హతలను చెక్ చేసుకోవాలి. వాటికి అర్హులుగా ఉంటే.. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)