ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. ఫలితాల విడుదల తేదీపై అధికారులు తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎల్లుండి అంటే ఆగస్టు 3న టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా ఎవరైనా విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే ఇంప్రూవ్ మెంట్ రాసే అవకాశాన్ని సైతం కల్పించింది ఏపీ ప్రభుత్వం. సాధారణంగా ఇంటర్ విద్యార్థులకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉంటుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అవకాశాన్ని కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)