Watchman Jobs: గుడ్ న్యూస్.. 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Watchman Jobs: గుడ్ న్యూస్.. 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం ఉంది. వాటిని రక్షించడానికే ఈ వాచ్ మెన్ పోస్టులను మంజూరు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 5,388 పోస్టులు ఉన్నట్లు.. వీటిని భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం) (Photo Credit : Getty)
2/ 7
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా రూ.6వేలు అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Photo Credit : Getty)
3/ 7
అయితే ఈ పోస్టులకు ఇప్పటికే పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద ఆయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. గ్రామం లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్లకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం కల్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్.. ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం ఉంది. కావునా.. ఈ వస్తువులన్నింటిని రక్షించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మెన్ పోస్టుల నియామకానికి నిశ్చయించింది.
7/ 7
దీనిలో భాగంగానే.. మొత్తం 5,388 నాడు నేడు హైస్కూల్లలో పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)