సైబర్ నేరాలపై అవగాహన, వాటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన విధానాలపై ఈ కోర్సును రూపొందించారు. సంప్రదాయ డిగ్రీతోపాటు బీఫార్మసీ తదితర డిగ్రీ స్థాయి కోర్సుల్లో విద్యార్థులు ఈ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించటమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలివస్తున్న నేపథ్యంలో...ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఐటీ కంపెనీలన్నీ కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివిన వారికే పెద్దపీట వేస్తున్న క్రమంలో.. ఈ కోర్సు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కాలేజీల్లో కూడా ఈ కోర్సును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)