అయితే ఇటీవల గ్రూప్ 4 పరీక్షను నిర్వహించే తేదీని టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్షను నిర్వహించనుండగా.. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
కాగా ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే రోజు కంటే.. వారం రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. టీఎస్పీఎస్సీ నుంచి విడుదలైన ప్రతీ పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను జారీ చేస్తారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
మొత్తం 8,180 ఉద్యోగాలు..
గ్రూప్–4 కేటగిరీలో మొత్తం 8,180 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాదాపు 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యనిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72... (ప్రతీకాత్మక చిత్రం)
వీటితో పాటు.. ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245 ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)