ANOTHER 79000 PRIVATE TEACHERS IN TELANGANA RECEIVED CORONA FINANCIAL ASSISTANCE VB
Telangana Teachers: తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం.. తాజాగా వారి అకౌంట్లలో డబ్బులు జమ..
Telangana Teachers: తెలంగాణ ప్రభుత్వం కరోనా సాయం పేరుతో ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికీ రూ.2,000 తో పాటు 25 కేజీల సన్నబియ్యం ఇస్తుంది. తాజాగా మరో 79 వేల మంది ప్రైవేట్ సిబ్బంది లబ్ధి పొందారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు మూసివేయడంతో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించాలని గతంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
2/ 9
ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉంటే అందరికీ ఆ ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా అధికారులు వాటిని అమలు చేశారు.
3/ 9
అయితే తాజాగా మరో 79వేల మంది ప్రైవేటు పాఠశాలల్లోని సిబ్బంది లబ్ధి పొందారు.
4/ 9
లబ్దిదారులుగా ఎంపిక చేసిన వారి నుంచి అధికారులు బ్యాంక్ అకౌంట్ నంబర్లు, వివరాలూ తీసుకున్నారు.
5/ 9
వారందరికీ వారి అకౌంట్లలోకి డబ్బు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
6/ 9
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రతి నెలా రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల సన్నబియ్యం అందించగా.. తాజాగా మరో 79 వేల మంది లబ్ధి పొందారు.
7/ 9
తెలంగాణలో స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యేవరకూ ఈ సాయం ప్రతి నెలా అందిస్తామని ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే.