Andhra Pradesh: ఇకపై ఏడాదికి ఒక్కసారే టెట్.. నోటిఫికేషన్ ఎప్పుడు? పరీక్ష, అర్హత వివరాలు

టీచర్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో కీలక మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం.టెట్‌ను ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. గతంలో ఏటా రెండు సార్లు నిర్వహించే వారు. కానీ ఆ నిబంధనను సవరించారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్‌ బుధవారం టెట్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు.